: విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం పరిశీలిస్తోంది: సురేష్ ప్రభు
విశాఖపట్టణానికి రైల్వే జోన్ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. తన అత్తగారి హఠాన్మరణంతో విశాఖపట్టణం వచ్చిన సందర్భంగా సురేష్ ప్రభు మాట్లాడుతూ, భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషపడే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. హుదూద్ తుపాను నష్టం నుంచి విశాఖ ప్రజలు అద్భుతంగా కోలుకున్నారని ఆయన కితాబిచ్చారు. విశాఖ ప్రజల మనోభావాలు గుర్తించామని, త్వరలోనే వాటిని నెరవేరుస్తామని ఆయన చెప్పారు. కాగా, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్టు గత కొంత కాలంగా రాష్ట్ర నేతలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే.