: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 27,564కు పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో 8,335కు పడిపోయింది. ఈ నాటి టాప్ గెయినర్స్ లో వోక్ హార్డ్ లిమిటెడ్, బజాజ్ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్, క్యాడిలా హెల్త్ కేర్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, కర్ణాటక బ్యాంక్ లు ఉన్నాయి. టెక్ మహీంద్రా, పుంజ్ లాయిడ్, టీటీకే ప్రిస్టేజ్ లిమిటెడ్, భారతి ఇన్ ఫ్రా టెల్ లిమిటెడ్, యూపీఎల్ లిమిటెడ్ కంపెనీలు టాప్ లూజర్స్ గా నిలిచాయి.