: సింగపూర్ విమానంలో సాంకేతిక లోపం...ప్రయాణికుల్లో ఆందోళన


సింగపూర్ కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. సింగపూర్ నుంచి షాంఘై వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం బయల్దేరిన మూడున్నర గంటలకు అందులోని రెండు ఇంజన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అంతా ఆందోళన చెందారు. అయితే పైలట్లు చాకచక్యంగా విమానంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సంభవించిన సమయంలో విమానంలో 182 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అనంతరం షాంఘై విమానాశ్రయంలో అంతా క్షేమంగా దిగారు.

  • Loading...

More Telugu News