: పాక్ సానుభూతిపరులకు వార్నింగ్ ఇచ్చిన రాజ్ నాథ్ సింగ్


భారత భూభాగంలో పాక్ అనుకూల నినాదాలు చేస్తే సహించేది లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పాక్ అంతర్గత వ్యవహారాలు చూసుకుంటే మంచిదని సలహాఇచ్చారు. అనవసర విషయాల్లో కలుగజేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు. యూపీఏ ప్రభుత్వం రక్షణ అంశాలను పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో 40 రక్షణ ఒప్పందాలను చేసుకుని దేశ రక్షణపై చిత్తశుద్ధి చాటుకుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News