: ఆమె అందానికి ఫిదా అయిన రవీంద్ర జడేజా!


ఐపీఎల్-8 ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఓ సుందరాంగి అందరినీ ఆకర్షించింది. చూపు తిప్పుకోనివ్వని అందంతో మెరిసిపోయిన ఆ ముద్దుగుమ్మ యెస్ బ్యాంక్ ఫౌండర్, సీఈవో రాణా కపూర్ కుమార్తె రాఖీ. ఆ రోజు ఆటగాళ్లకు బహుమతులు అందించింది ఆ సొగసరే. దీంతో, ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. ఎవరా బ్యూటీ? అంటూ స్టేడియంలో చర్చోపచర్చలు సాగాయట. ఆమె అందం ప్రేక్షకులనే కాదు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజాను కూడా క్లీన్ బౌల్డ్ చేసింది. అందుకేనేమో... ఆమెను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ వదిలాడు. "క్యూటెస్ట్ గాళ్ ఆఫ్ ఐపీఎల్... నేడు ఆమె ప్రతి ఒక్కరి మనసును దోచేసింది" అంటూ పేర్కొన్నాడు. ఆ ప్రతి ఒక్కరిలో తానూ ఉన్నానని చెప్పకనే చెప్పాడు. అన్నట్టు... రాఖీ వివాహిత. దుబాయ్ కి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఎంబీయే చదివిన ఈ అమ్మడు వ్యాపార రంగంలోనే ఉందట.

  • Loading...

More Telugu News