: వాళ్ల జోలికెళితే కేసీఆర్ పతనం మొదలైనట్టే!: మంద కృష్ణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఉస్మానియా విద్యార్థుల జోలికెళితే కేసీఆర్ పతనం మొదలైనట్టేనని హెచ్చరించారు. ఓయూ భూములను తాకొద్దని, పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనుకుంటే కేబీఆర్ పార్కు, గోల్ఫ్ కోర్సు భూములను కేటాయించాలని అన్నారు. ఓయూ భూముల వ్యవహారంలో అరెస్టయిన విద్యార్థులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి భద్రత లేకుండా ఓయూలో అడుగుపెడితే కేసీఆర్ ధైర్యవంతుడే అని వ్యాఖ్యానించారు.