: జవహర్ లాల్ నెహ్రూని కొనియాడిన మోదీ... నివాళి అర్పించిన ప్రముఖులు
స్వతంత్ర భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. నెహ్రూ 51వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి ప్రధానమంత్రిగా ఆయన మన దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని, వాటిని గుర్తుంచుకోవాలని ట్విట్టర్లో తెలిపారు. మరోవైపు, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, షీలా దీక్షిత్, గులాంనబీ అజాద్ తదితర ప్రముఖులు నెహ్రూ ఘాట్ వద్ద నివాళి అర్పించారు.