: పవన్ ఎంత కృషి చేశారో నేనూ అంతే కృషి చేశా: కారెం శివాజీ
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం తానెంతో శ్రమించానని, అయినా గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు, తనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ ఎంత కష్టపడ్డారో, తానూ అంతే కష్టపడ్డానని శివాజీ స్పష్టం చేశారు. అయితే, దళితుడిని అయినందునే తనను పక్కనబెట్టారని ఆరోపించారు.