: తిరుమలలో భక్తులను పరుగులు పెట్టించిన పాము


తిరుమల 'వెంకటకళ' గెస్ట్ హౌస్ వద్ద 9 అడుగుల పొడవైన పాము కలకలం రేపింది. వీఐపీలు బస చేసే గెస్ట్ హౌస్ వద్ద పాము కనిపించడంతో భక్తులు కకావికలం అయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. పాము విషయం తెలుసుకున్న అధికారులు భాస్కర్ అనే పాములు పట్టే నిపుణుడికి సమాచారం అందించారు. అతను వచ్చి దాన్ని ఒడుపుగా బంధించాడు. ఆ పాము 'జెర్రిపోతు' అని తెలిపారు. ఎలుకలు దాని ప్రధాన ఆహారం అని, గెస్ట్ హౌస్ సమీపంలో చెత్త పేరుకుపోవడంతో ఆహారం కోసం వచ్చి ఉంటుందని వివరించారు.

  • Loading...

More Telugu News