: హాట్ బెలూన్ ఎగురవేసి అరెస్టయ్యారు


పర్మిషన్ లేకుండా హాట్ బెలూన్ ఎగురవేసి ఇద్దరు అరెస్టయ్యారు. వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని విమానాశ్రయానికి దగ్గర్లోని ఓ గ్రౌండ్ లో వజ్రాల కంపెనీ క్రికెట్ పోటీలు నిర్వహించింది. ఇందుకు అనుమతి తీసుకుంది. అయితే, సదరు కంపెనీకి ప్రచారం ఘనంగా ఉండాలి కదా...ఈ పోటీల సంగతి ముంబై మొత్తం తెలిసేలా గ్రౌండ్ లో హాట్ ఎయిర్ బెలూన్ ఒకటి ఏర్పాటు చేసింది. దీని మీద కంపెనీ పేరుతో ప్రచారం చేసుకుంది. ఇంతలో విమానాశ్రయ పోలీసు సిబ్బంది వచ్చి, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించడంతో, బెలూన్ ఎగుర వేయడానికి పర్మిషన్ తీసుకోలేదని, బెలూన్ ఎగురవేసిన కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిందని వారు వివరించారు. ఈ బెలూన్ కారణంగా విమానాలు ఆలస్యంగా బయల్దేరడం విశేషం.

  • Loading...

More Telugu News