: గంగిరెడ్డితో స్మగ్లర్ మణి అణ్ణన్ కు సంబంధాలున్నాయి: ఎస్పీ నవీన్ గులాటీ


ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరెస్టైన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మణి అణ్ణన్ కు మారిషస్ లో ఉన్న స్మగ్లర్ గంగిరెడ్డితో సంబంధాలున్నాయని కడప ఎస్పీ నవీన్ గులాటీ చెప్పారు. ఈ సాయంత్రం అతనిని రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. ఢిల్లీలో నిన్న(సోమవారం) అదుపులోకి తీసుకున్న మణిని గత రాత్రే కడప జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు కోడూరుకు తీసుకువచ్చారు. అనంతరం కడప పీఎస్ లో అతనిపై 353, 307, 120బీ, 379, 34 ఐపీసీ యాక్ట్, 30 పీడీయాక్ట్ కిందకేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతన్ని ఎస్పీ గులాటీ ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News