: సీఎం చంద్రబాబును కలసిన సినీరంగ ప్రముఖులు


ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో పలువురు సినీరంగ ప్రముఖులు కలిశారు. హుద్ హుద్ బాధితులకు ఇళ్లు కట్టిస్తామంటూ ముందుకొచ్చారు. ఇందుకుగానూ ప్రభుత్వం తమకు స్థలం కేటాయిస్తే ఇళ్ల నిర్మాణం చేపడతామని సీఎంకు తెలిపారు. ప్రస్తుతం వారు బాబుతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది ఉత్తరాంధ్రలో సంభంవించిన హుద్ హుద్ తుపాను బాధితులకు సహాయార్ధం తెలుగు సినీ పరిశ్రమ కోట్ల రూపాయల విరాళాన్ని ఏపీ ప్రభుత్వానికి అందించింది. అప్పడే బాధితులకు ఇళ్ల నిర్మాణంపై సినీ ప్రముఖులకు చంద్రబాబు సూచన చేశారు.

  • Loading...

More Telugu News