: ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదు!: కన్నా లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై ఒక్కొక్కరు ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారు. హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. తాజాగా ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కొంత విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని అంటున్నారు. గత యూపీఏ ప్రభుత్వమే ఆ హామీ ఇచ్చిందని, హోదా అంశం అసలు చట్టంలో లేదని అన్నారు. హోదా రాకపోవడం వల్ల ఏపీకి వచ్చే నష్టమేమి లేదని చెబుతున్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కొందరికి చేతగాకే బీజేపీని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన కన్నా, ఏపీ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు.