: బదానియా సమాచారం ఇచ్చాడు... మణిఅన్నన్ ను పట్టుకొచ్చారు
ఎర్రచందనం కేసులో తీగ లాగే కొద్దీ డొంకలు కదిలి వస్తున్నాయి. ఇటీవల హర్యానాలో పట్టుబడ్డ బడా స్మగ్లర్ బదానియాను విచారించిన పోలీసులు, ఢిల్లీలో మరో అంతర్జాతీయ స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నారు. బదానియా ఇచ్చిన సమాచారంతో, రాజంపేట డీఎస్పీ అరవింద్ బాబు నేతృత్వంలోని బృందం ఢిల్లీకి వెళ్లి తమిళనాడుకు చెందిన మణిఅన్నన్ ను అరెస్ట్ చేసి కడపకు తరలించారు. దుబాయ్ తదితర దేశాలకు మణిఅన్నన్ ఎర్రచందనాన్ని సరఫరా చేశాడని, తమిళనాడు, చిత్తూరు జిల్లాల్లో ఇతనిపై పలు కేసులు వున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా మణిఅన్నన్ ను కడపకు తరలించిన పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.