: ఇక లోకేష్ కు కీలక బాధ్యతలు!


రేపటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాదులోని గండిపేటలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా యువనేత లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. వైకాపా నేత జగన్ ను ఎదుర్కొనే దిశగా లోకేష్ కు రాజకీయ బాధ్యతలు అప్పగించాలని ఇప్పటికే తెలుగుదేశం సీనియర్ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు యనమల నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఇక లోకేష్ ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో, మహానాడు ముగిసేలోగా, ఆయనకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ, నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News