: ఆ రైలులో ఓ ఏసీ బోగీ మిస్!


వేసవిలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుంచి చెన్నైకి నడుపుతున్న వీక్లీ ఎక్స్ ప్రెస్ (22869) రైలులో ఒక ఏసీ బోగీ మిస్ అయింది. దీంతో ఆ బోగీలో ప్రయాణించాల్సిన సుమారు 70 మందికిపైగా ప్రయాణికులు రైలును కదలనీయలేదు. రిజర్వేషన్లు ఇచ్చిన లెక్క ప్రకారం ఏసీ బోగీలను అమర్చడంలో అధికారులు చూపిన నిర్లక్ష్యంతో ఓ థర్డ్ ఏసీ కంపార్టుమెంట్ మిస్ అయింది. అడిగితే రైల్వే అధికారులు సైతం సరిగ్గా స్పందించకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారులపై దాడి చేసినట్టుగా కూడా సమాచారం. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఓ ఏసీ బోగీని తెప్పించి దానికి ఎటాచ్ చేసి రెండు గంటల ఆలస్యంగా రాత్రి 9.15 గంటలకు రైలును కదిలించారు.

  • Loading...

More Telugu News