: రాజధాని బాధ్యత అప్పగించారు...సమర్థవంతంగా పూర్తి చేశాం: ఈశ్వరన్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారని సింగపూర్ పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నమ్మకాన్ని వమ్ముచేయకుండా సమర్థవంతంగా పూర్తి చేశామని అన్నారు. దీనిని నైపుణ్యంతో నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాజధానికి ప్లాన్ రూపొందించామని ఆయన చెప్పారు. ప్రజలు, ప్రభుత్వం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణానికి ప్లాన్ సిద్ధం చేశామని ఆయన చెప్పారు. కలల రాజధానికి సరైన ప్లాన్ చేశామని చెప్పిన ఆయన, దీనిని మూడు నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. ఇది అనుకున్నట్టు పూర్తైతే ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిలుస్తుందని ఆయన వెల్లడించారు. ఇంత మంచి అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఇతర అధికారులకు ధన్యవాదాలని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News