: ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డుకెక్కుతారు: విజయసాయి రెడ్డి
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సర్కారు వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నేతలు ఎండగడుతున్నారు. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి విజయసాయి రెడ్డి గుంటూరు మీడియా సమావేశంలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన బాబు... అధికారం చేపట్టాక చేసిన తొలి ఐదు సంతకాలను అమలు చేయకుండా అభాసుపాలు చేశారన్నారు. ఆ ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను నిలువునా మోసం చేశారన్న విజయసాయి, అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడంలో బాబు గిన్నిస్ రికార్డుకెక్కుతారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జూన్ 3, 4 తేదీల్లో వైసీపీ సమరదీక్ష చేయబోతున్నట్టు తెలిపారు.