: వియత్నాంలో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటుకు ఇస్రో యోచన


భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో వియత్నాంలో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుపై ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఆసక్తి కనబరుస్తోంది. ఇస్రోకు భారత్ లోనే కాకుండా... మారిషస్, ఇండోనేషియా దేశాల్లోనూ గ్రౌండ్ స్టేషన్లున్నాయి. తాజా గ్రౌండ్ స్టేషన్ భారత ఉపగ్రహాల నుంచి సమాచార స్వీకరణ, విశ్లేషణ, తదనంతర వినియోగం వంటి అంశాల్లో తోడ్పడనుంది. అంతేగాకుండా, ఈ కేంద్రం ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి (ఆసియాన్)లో సభ్యత్వం ఉన్న బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్ లాండ్, వియత్నాం దేశాలకు స్పేస్ సైన్స్, టెక్నాలజీ, అప్లికేషన్లు వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగపడనుంది. కాగా, ఈ కొత్త గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటుకు ఇస్రో ప్రధాని మోదీని ఒప్పించినట్టే కనిపిస్తోంది. ఆయన కూడా ఈ అంశాన్ని మయన్మార్ లో జరిగిన ఇండియా-ఆసియాన్ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News