: జూనియర్ ఎన్టీఆర్ ను బాగా వాడుకున్నారు... లోకేశ్ కోసం పక్కనబెట్టారు: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గతంలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ కోసం బాగా వాడుకున్నారని, ఇప్పుడు తనయుడు లోకేశ్ ను ప్రమోట్ చేయడం కోసం జూనియర్ ను దూరం పెట్టారని అన్నారు. ఏపీ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. చంద్రబాబు మోసాలను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ పుస్తకంలో రాశారని, నందమూరి హరికృష్ణ తదితరులను బాబు ఎలా వంచించాడన్నది ఆ పుస్తకంలో బాగా వివరించారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా అమలు చేయని టీడీపీ ఇప్పుడు నిర్వహించాల్సింది మహానాడు కాదని, 'దగానాడు' అని రఘువీరా వ్యాఖ్యానించారు. 'ఏపీకి ప్రత్యేక హోదా' సదస్సులో ఆయన పైవిధంగా పేర్కొన్నారు.