: లోగో మార్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ


ఢిల్లీలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ లోగో మార్చుకుంది. ఇంతవరకు కాషాయం-ఆకుపచ్చ రంగుతో ఉన్న లోగో ఇక నుంచి నీలి రంగులో కనిపించనుంది. ఈ మేరకు పార్టీ తమ ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలలో కొత్త లోగోను ఉంచింది. అయితే ఆప్ వెబ్ సైట్ లో మాత్రం ఇంకా పాతదైన వివాదాస్పద లోగోనే ఉంచారట. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సమయంలోనే లోగోను మార్చడం విశేషం. గతంలో పార్టీ లోగోను ఆప్ వాలంటీర్ సునీల్ లాల్ అనే వ్యక్తి డిజైన్ చేశాడు. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పిన అతనే, తాను రూపొందించిన లోగోను ఏ విధంగానూ ఉపయోగించవద్దని డిమాండ్ చేశాడు. అది తన మేధో సంపత్తితో రూపొందించినదని, అయితే దానిపై అధికారం మాత్రం పార్టీకి ఇవ్వలేదన్నాడు. కాబట్టి తక్షణమే లోగోను ఉపయోగించడం ఆపాలంటూ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కొన్ని నెలల కిందట సునీల్ లేఖ రాశాడు. ఈ నేపథ్యంలోనే పార్టీ లోగోను ఆప్ మార్చడానికి కారణమైంది.

  • Loading...

More Telugu News