: విజయవాడలో టీడీపీ యువనేత అనుమానాస్పద మృతి


విజయవాడలో తెలుగుదేశం పార్టీ యువనేత ఒకరు అనుమానాస్పద స్థితిలో రోడ్డుపక్కన విగతజీవిగా కనిపించాడు. పట్టణ టీడీపీ అర్బన్ కార్యదర్శి పడాల కన్నా మృతదేహం చుట్టుగుంట దగ్గర రోడ్డుపై కనిపించింది. కన్నా మృతిపై తెలుగుదేశం వర్గాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. అతని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహంపై ఎటువంటి గాయాలూ లేవని తెలిపారు. పోస్టు మార్టం పూర్తయిన తరువాత మాత్రమే మరణానికి కారణాలు తెలుస్తాయని వివరించారు. కన్నా మృతిపై ఆందోళన చేసేందుకు దేశం శ్రేణులు సిద్ధమవుతున్నాయి. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో బందోబస్తును పెంచారు.

  • Loading...

More Telugu News