: 'ఉస్తాద్ ను అడవిలో వదలాల్సిందే' అంటూ రోడ్డెక్కిన యువత!


'మా ఉస్తాద్ ను బోనులో బందీగా ఉంచద్దు. తిరిగి అడవిలో వదిలి పెట్టాల్సిందే'నని యువత, ముఖ్యంగా జంతు ప్రేమికులు రోడ్డెక్కారు. ఉస్తాద్ అంటే ఓ పులి. దీన్ని రాజస్థాన్ లోని అడవుల్లో పట్టుకొని హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్క్ కు తరలించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జంతు ప్రేమికులు తక్షణం ఉస్తాద్ ను అడవుల్లో వదిలేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్నా చౌక్ లో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. 'నాకు న్యాయం చెయ్యాలి', 'నేను ఇక్కడే గర్జిస్తాను, ఇక్కడే ఉంటాను' అంటూ ఉస్తాద్ చిత్రాలతో కూడిన పోస్టర్లను యువత ప్రదర్శించింది.

  • Loading...

More Telugu News