: ఇంధన పొదుపు ప్రచారకర్తలుగా సైనా, గోపీచంద్
రాష్ట్రంలో ఇంధన పొదుపుపై ప్రచారకర్తలుగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, కోచ్ గోపీచంద్ లు వ్యవహరించే అవకాశం ఉంది. విద్యుత్తు పొదుపు, ఇంధన సహజ వనరుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీరు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇంధన పరిరక్షణ మిషన్ వీరికి సమగ్ర సమాచారం అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఇంధన పొదుపుపై మరింత ప్రచారం చేయనున్నట్లు మిషన్ తెలిపింది.