: 'రోహిణి' వచ్చేసింది... మరో మూడు రోజులు సూర్యుడి విశ్వరూపం
రోళ్లు పగిలే సమయం వచ్చేసింది. వేసవి కాలంలో సూర్యుడు అత్యంత వేడిమిని వెదజల్లే రోహిణీ కార్తె నేటి నుంచి ప్రవేశించింది. భూమికి సూర్యుడు అత్యంత దగ్గరగా ఉండే సమయమిది. సుమారు రెండు వారాల పాటు రోహిణీ కార్తె కొనసాగనుంది. మరో 10 రోజుల పాటు సూర్యుడి అత్యంత తీవ్రమైన కిరణాలు భూమిని తాకుతాయి. ఆపై నెమ్మదిగా తీవ్రత తగ్గుతుంది. కాగా, కనీసం మరో మూడు రోజుల పాటు ఉష్ణతాపం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మూడు రోజులూ రికార్డు స్థాయి వేడి కొనసాగుతుందని, సాధ్యమైనంత వరకూ బయట తిరగకుంటేనే మంచిదని సలహా ఇచ్చారు.