: రోడ్డుపై మొండెంలేని తల... ప్రజల్లో తీవ్ర భయాందోళన!


గౌలీగూడ శివాజీ బ్రిడ్జి వద్ద రోడ్డుపై మొండెంలేని తల కనిపించగా, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉప్పుగూడ సమీపంలో సుమారు 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకోవడంతో శరీరం నుంచి తల వేరైంది. విషయం తెలుసుకున్న పోలీసులు శరీరం, ఇతర భాగాలనూ మూటగట్టి, ఓ రిక్షాలో వేసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించాలని భావించారు. మార్గమధ్యంలో గౌలీగూడా వద్ద మృతుడి తల మూట నుంచి జారి రోడ్డుపై పడగా, దాన్ని గమనించకుండానే వారు వెళ్లిపోయారు. గుర్తు తెలియని వ్యక్తిని చంపి తలను పారేసి పోయారని స్థానికంగా వదంతులు వ్యాపించాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు విషయాన్ని పైఅధికారులకు సమాచారం ఇచ్చారు. ఉస్మానియా వరకూ వెళ్లిన రైల్వే పోలీసులు తల ఎక్కడో పడిపోయిందని తెలుసుకుని వెతుక్కుంటూ వెనక్కు వచ్చి దాన్ని తీసుకుపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News