: పదకొండేళ్లకే డిగ్రీ చేసేశాడు...భవిష్యత్ లో అమెరికా ప్రెసెడెంట్ అవుతానంటున్నాడు


పదకొండేళ్లకే డిగ్రీ పూర్తి చేసిన చిచ్చరపిడుగు, అప్పుడే అమెరికా అధ్యక్ష పీఠంపై కన్నేశాడు. 11 ఏళ్ల పిల్లలంతా స్మార్ట్ ఫోర్లు, ఐపాడ్లు, టాబ్లెట్లలో వీడియో గేమ్స్ ఆడుకుంటుంటే భారత సంతతికి చెందిన తనిష్క అబ్రహాం మాత్రం పుస్తకాలతో కుస్తీ పట్టాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని అమెరికన్ రివర్ కాలేజీ నుంచి మేథ్స్, సైన్స్, ఫారిన్ లాంగ్వేజెస్ స్టడీస్ సబ్జెక్టుల్లో పట్టా పొందాడు. ఈ సందర్భంగా తనిష్క్ మాట్లాడుతూ, డిగ్రీ పట్టా సంపాదించాలనుకున్నానని, అందుకే నేర్చుకోవాలనే కోరికను పెంపొందించుకుని డిగ్రీ సాధించానని అన్నాడు. ఈ కోరికను ఇలాగే సాధిస్తూ, భవిష్యత్ లో పరిశోధనలు చేయాలనుకుంటున్నట్టు తెలిపాడు. అలాగే భవిష్యత్ లో అమెరికా అధ్యక్షుడిగా నిలవాలని భావిస్తున్నానని తనిష్క్ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News