: పోలీసు కస్టడీకి బదానీ... 'ఎర్ర' ప్రముఖుల పేర్లు బయటపడేనా?
ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్ బదానీని ప్రశ్నించేందుకు కడప జిల్లా బద్వేలు పోలీసులు ఈ ఉదయం కస్టడీకి తీసుకున్నారు. బదానీని ప్రశ్నించి స్మగ్లింగ్ వెనకున్న ముఠా వివరాలు, మరింత సమాచారం తెలుసుకునేందుకు కోర్టు అనుమతించడంతో, ఈ ఉదయం కడప కేంద్ర కారాగారం చేరుకున్న పోలీసులు బదానీని బద్వేలుకు తరలించారు. బదానీని ఇటీవల హర్యాణాలోని హిస్సార్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను విచారించి ఎర్రచందనం స్మగ్లింగ్ వెనకున్న బడా నేతల పేర్లను బయటపెట్టాలన్నది పోలీసుల అభిమతం. ఈ దిశగా ఏ మేరకు విజయం సాధిస్తారన్న విషయం త్వరలోనే వెల్లడికానుంది.