: అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన ఎక్కడ?: స్థల పరిశీలనలో ప్రభుత్వం


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం నిమిత్తం వచ్చే నెల రెండవ వారంలో శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం నిర్ణయించడంతో, భూమి పూజ ఎక్కడ జరపాలన్న విషయమై అధికారులు స్థలాలను అన్వేషిస్తున్నారు. నేటి ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్‌ దండే పలు స్థలాలను పరిశీలించారు. రాజధానికి ఈశాన్య దిశగా పూజ జరపాలని పండితులు స్పష్టం చేయడంతో ఆ దిశగా అన్వేషణలు జరిపి గుర్తించిన ప్రాంతాలను ఆయన చూశారు. వెంకటాయపాలెం, మందడం, తాళ్లాయపాలెంలో గుర్తించిన స్థలాలను పరిశీలించారు. ఈశాన్య దిశగా రెండు చోట్ల స్థలాలు గుర్తించామని కలెక్టర్ వివరించారు. సింగపూర్ అధికారులు బృహత్ ప్రణాళిక అందించగానే శంకుస్థాపన జరిపే స్థలంపై అధికారిక ప్రకటన వెలువరిస్తామని కలెక్టర్ వివరించారు.

  • Loading...

More Telugu News