: ఆత్మహత్య చేసుకున్న తల్లీ కొడుకుల మృతదేహాలు అప్పగించిన పాకిస్థాన్


దాదాపు నెల రోజుల క్రితం చీనాబ్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లీ కొడుకుల మృతదేహాలను పాకిస్థాన్ సైన్యం భారత అధికారులకు అప్పగించింది. ఇనాయత్ సమీపంలోని సరిహద్దు చెక్ పోస్టు వద్ద గత రాత్రి 9:15 గంటల సమయంలో బీఎస్ఎఫ్ దళాలకు పాక్ సైన్యం మృతదేహాలను అప్పగించినట్టు అధికారులు తెలిపారు. రాజౌరీ జిల్లాకు చెందిన కల్సియాన్ నివాసి సునీల్ కుమార్ భార్య అనితా చౌదరి, తన మూడేళ్ల కొడుకు అరుణ్ కుమార్ సహా గత నెల 28న చీనాబ్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. నదీ ప్రవాహానికి వీరి దేహాలు పాకిస్థాన్ లోకి కొట్టుకుపోయాయి. మృతదేహాలను అనిత తరపు బంధువులకు అప్పగించామని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News