: పోలీసు ఉద్యోగి కుమార్తెలు అదృశ్యం


ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న రామ్ బోవి కుమార్తెలు బిందూ రామ్ (20), రుచిత్ రామ్ (19)లు అదృశ్యమయ్యారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కర్ణాటకకు చెందిన రామ్ బోవి తన కుటుంబంతో కలసి హైదరాబాదు పరిధిలోని మల్లెలబావి ప్రాంతంలో నివసిస్తున్నారు. శుక్రవారం నాడు భార్య నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వీరు ఎక్కడికి వెళ్లారన్న విషయమై ఇంకా సమాచారం లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News