: ఈ ఫోన్ స్పెషాలిటీ 'డ్యుయల్ డిస్ ప్లే'!
డ్యుయల్ సిమ్ సౌకర్యమున్న ఫోన్లు కోకొల్లలు. మరి, డ్యుయల్ డిస్ ప్లే ఫోన్లు కూడా వుంటే బాగుండును కదా అనుకుంటున్నారా? మీ కోరిక తీరుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ 'యోటా డివైన్' ఇలాంటి డ్యుయల్ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'డ్యుయల్ డిస్ ప్లే యోటా ఫోన్2' పేరిట అమెరికా మార్కెట్లో ఈ కొత్త రకం ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్ కేవలం నలుపు, తెలుపు రంగుల్లోనే లభ్యమవుతుంది. ఈ ఫోన్ తో రెండు వైపుల నుంచి ఫోన్ చేసుకునే సౌకర్యం ఉంది. దీంతో ఈ ఫోన్ కు మంచి ఆదరణ లభిస్తుందని 'యోటా' అంచనా వేస్తోంది.