: ఈ ఫోన్ అందుబాటులోకి వస్తే పెను సంచలనమే!
వినియోగదారులను ఆకట్టుకునేందుకు స్మార్ట్ ఫోన్ సంస్థలు వినూత్న సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇంటెక్స్ సరికొత్త యాప్ తో కొత్త మోడల్ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేయనుంది. ఈ యాప్ లో ఫ్రీ కాలింగ్ సౌకర్యం ఉంది. సింగపూర్ ఆధారిత మొబైల్ ఫోన్ యాప్ కంపెనీ భాగస్వామ్యంతో 'నను' అనే యాప్ ను ఇంటెక్స్ భారతీయులకు పరిచయం చేయనుంది. కాగా, ఇప్పటికే ఈ 'నను' యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా 2.2 మిలియన్ల మంది వినియోగిస్తుండగా, వీరిలో 1.5 మిలియన్ల మంది భారతీయులు అని సంస్థ వెల్లడించింది. ఈ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 'నను' యాప్ లేని మొబైల్, ల్యాండ్ లైన్ ఫోన్లకు కాల్ చేసుకోవచ్చని ఇంటెక్స్ చెబుతోంది. ఈ ఫోన్ అందుబాటులోకి వస్తే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో పెను సంచలనం నమోదవుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.