: వ్యాట్ తగ్గించకపోతే బంకులు మూసేస్తాం: ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం
పెట్రోలు, డీజిల్ పై పెంచిన వ్యాట్ తగ్గించకపోతే బంకులు మూసేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డీలర్లు అల్టిమేటం జారీ చేశారు. గుంటూరులో పెట్రోల్ డీలర్ల యజమానుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అంతర్జాతీయ చమురు ధరల కనుగుణంగా ఇక్కడ కూడా పెరడగంతో వినియోగదారులపై భారం పెరిగిపోయిందని, ప్రభుత్వం వ్యాట్ పెంచడం వల్ల ప్రజలు వాహనాలు వినియోగించాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వ్యాట్ తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.