: ఆసియాలోనే అతిపెద్ద 'సిలువ' పాకిస్థాన్ లో నిర్మితమవుతోంది


ఆసియాలోనే అతి పెద్ద సిలువ నిర్మితమవుతోంది. అయితే, ఇది ఏ సెక్యులర్ దేశంలోనో కాదు... ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ లో. పాక్ వాణిజ్య రాజధాని అయిన కరాచీలో పర్వేజ్ హెన్రీ గిల్ అనే క్రిస్టియన్ వ్యాపారవేత్త దీన్ని నిర్మిస్తున్నాడు. ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ తో నిర్మితమవుతోందని... దీనిపై దాడి చేయాలనుకునే వారు ఎవరూ సఫలం కాలేరని హెన్రీ తెలిపారు. ఇది దేవుడి చిహ్నమని చెప్పారు. ఈ సిలువ ఎత్తు 140 అడుగులు. 20 అడుగుల దిమ్మెపై దీన్ని నిర్మిస్తున్నారు. పాక్ లో క్రిస్టియన్లను శత్రు భావంతో చూడటం సహజమే. ఇటీవలే పాక్ లోని ఓ చర్చిపై బాంబు దాడి జరగ్గా... ఆ ఘటనలో వందకు పైగా క్రిస్టియన్లు మరణించారు. రెండు కోట్లకు పైగా జనాభా కలిగిన కరాచీలో 10 లక్షల వరకు క్రిస్టియన్లు ఉంటారు.

  • Loading...

More Telugu News