: చంద్రబాబుపై అసంతృప్తి వెళ్లగక్కిన కేఈ... కర్నూలుపై దృష్టి పెట్టడం లేదని ఆరోపణ
సీఎం చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు. బాబు చూపంతా ఎప్పుడూ పశ్చిమగోదావరి జిల్లాపైనేనని, కర్నూలుపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. అలాగని కర్నూలులో 3 సీట్లే గెలవడంలో తమ తప్పు లేదన్నారు. కొత్తగా కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వ్యక్తి చాలా శ్రమపడాలని సూచించారు. జిల్లాలో ఏ వీధి ఎక్కడుందో కొత్త అధ్యక్షుడికి తెలీదని ఎద్దేవా చేశారు. అయితే జిల్లా అధ్యక్షుడి మార్పు సాహసోపేతమైన నిర్ణయమని కేఈ అన్నారు.