: జగన్ 'సమర దీక్ష' పోస్టర్, వీడియో ట్రైలర్ విడుదల
వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన 'సమర దీక్ష' పోస్టర్, వీడియో ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందంటూ చంద్రబాబు పాలనను ఎండగడుతూ జూన్ 3, 4 తేదీల్లో మంగళగిరిలో జగన్ సమర దీక్షను చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్, వీడియో ట్రైలర్ ను వైకాపా నేతలు పార్థసారథి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయి రెడ్డిలు విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, దీక్ష ద్వారా చంద్రబాబు వైఫల్యాలను ఎండగడతామని... మహిళలు, రైతులు, నిరుద్యోగులను చంద్రబాబు ఎలా మోసం చేశారో ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.