: హమ్మయ్య... ఈ నెలాఖరుకు చల్లబడుతుందట!


ప్రచండ తేజోమూర్తిలా విరాజిల్లుతున్న సూర్యుడు ఇప్పుడు ప్రజల పాలిట విలన్ లా తయారయ్యాడు. అయితే, హైదరాబాద్ నగరంపై భానుడి ప్రతాపం ఈ నెలాఖరు వరకేనని, ఆ తర్వాత వాతావరణం చల్లబడుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. జూన్ మొదటివారంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని తెలిపారు. అటు దక్షిణ తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది.

  • Loading...

More Telugu News