: వరల్డ్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి
తైపీలో జరుగుతున్న ఏఐబీఏ మహిళల వరల్డ్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత అమ్మాయిలు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. హైదరాబాదుకు చెందిన నిహారిక గోనెల 70 కిలోల విభాగంలో ఫైనల్ చేరింది. చైనాకు చెందిన యు యువాన్ తో జరిగిన బౌట్లో నిహారిక పంచ్ ల వర్షం కురిపించింది. ఆరంభం నుంచే అటాకింగ్ కు ప్రాధాన్యమిచ్చి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక, ఇతర బౌట్లలో నెగ్గిన సోనియా (48 కిలోలు), సవిత (50 కిలోలు), మన్ దీప్ (52 కిలోలు), సాక్షి (54 కిలోలు) కూడా తమ విభాగాల్లో ఫైనల్ చేరారు.