: మిషెల్ ఒబామాను 'వేశ్య'గా అభివర్ణించిన ఐఎస్ఐఎస్
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అర్ధాంగి మిషెల్ ఒబామాను ఓ వేశ్యగా అభివర్ణించింది. అంతేగాకుండా, యాజిది మహిళలను చెరపట్టడాన్ని కూడా సమర్థించుకుంది. ఐఎస్ఐఎస్ కు చెందిన మ్యాగజైన్ 'దబీఖ్' ఓ వ్యాసంలో ఈ పైవిధంగా పేర్కొంది. ఈ ఆర్టికల్ కు 'స్లేవ్ గాళ్స్ ఆర్ ప్రాస్టిట్యూట్స్' అని శీర్షిక పెట్టారు. ఉమ్ సుమయ్యా అల్ ముహాజిరా ఈ వ్యాసం రాశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య దినార్ లో మూడోవంతుకు మించి విలువ చెయ్యదని, అసలు దినార్ లో మూడోవంతు కూడా ఎక్కువేనని ఆ వ్యాసంలో ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక, యాజిది యువతులను సెక్స్ బానిసలుగా చేసుకోవడం ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. అసలు మీ దేవుడెవరు? మీదే చట్టం? మీ మతం ఏంటి? ఇది తప్పని ఎలా చెబుతారు? అంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు.