: గవర్నర్ కోటాలో ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ఏపీలో గవర్నర్ కోటాలో నియమించే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను అధికార పార్టీ టీడీపీ ఖరారు చేసింది. మొత్తం నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీ జనార్దన్, బీద రవిచంద్ర, జి.శ్రీనివాసులు పేర్లు ప్రకటించారు. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో టీడీపీ తరపు నామినేషన్ వేసిన షరీఫ్, ప్రతిభాభారతిల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దానిపై నేడు ఈసీ ప్రకటన చేయనుంది.