: పెళ్లి ఫొటోలు తీసుకువస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు!


గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గింజుపల్లి తండా వాసి బాణావత్ గోపీనాయక్ ఆచూకీ లేకుండాపోయాడు. గోపీ నాయక్ వివాహం చండ్ర తండాకు చెందిన యువతితో జరిగింది. నవదంపతులు ఈ నెల 17న సత్తెమ్మ గుడిని సందర్శించారు. అనంతరం, పెళ్లి ఫొటోలు తీసుకువస్తానని గోపీ నాయక్ జగ్గయ్యపేట వెళ్లాడు. అయితే, అతడు తిరిగి రాలేదు. దీంతో, అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని వారు పోలీసులను కోరారు.

  • Loading...

More Telugu News