: అమెరికాలో ఏపీ రాజధాని టీ-షర్టుల విక్రయాలు
అమెరికాలో ఏపీకి చెందిన ఎందరో ఐటీ, ఇతర రంగాల్లో సేవలందిస్తున్నారు. వారిలో ఇప్పుడు రాష్ట్రాభిమానం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. రాష్ట్ర రాజధాని ప్రాంతం పేరిట టీ-షర్టుల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడ, గుంటూరు పేరిట ఈ టీ-షర్టులను ఈ-కామర్స్ వెబ్ సైట్లలో అమ్మకానికి పెట్టారు. 'ఇటీజ్ వేర్ మై స్టోరీ బిగిన్స్' అని రాసి ఉన్న ఆ టీ-షర్టులపై త్రివర్ణ పతాకం నేపథ్యంగా ఏపీ మ్యాప్, ప్రభుత్వ చిహ్నం ముద్రించి ఉన్నాయి. టీ-షర్టు ధర రూ.2476 కాగా, నెక్ టీ-షర్టు రూ.1396 పలుకుతోంది.