: నిప్పుల కొలిమిని తలపిస్తున్న సింగరేణి


తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. దీంతో, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఓపెన్ కాస్ట్ గనుల వద్ద 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, కార్మికుల వాదన మరోలా ఉంది. 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైతే లేఆఫ్ ప్రకటించాల్సి వస్తుందన్న కారణంగానే యాజమాన్యం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చూపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి 50 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదవుతోందని అంటున్నారు. ఎండవేడిమి దృష్ట్యా కనీసం పనివేళలనైనా మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News