: పాతబస్తీలో స్ట్రీట్ సెర్చ్... పోలీసుల అదుపులో 300 మంది యువకులు
ఇటీవల హైదరాబాద్ మీర్ చౌక్ లో జరిగిన స్ట్రీట్ ఫైట్ ఉదంతం పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో, శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు పాతబస్తీలో 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో, ఎలాంటి కారణం లేకుండా వీధుల్లో తిరుగుతున్న 300 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో అత్యధికులు 20 ఏళ్ల లోపు వారేనని తెలుస్తోంది. వారిని పాతబస్తీలోని ఓ మ్యారేజ్ హాల్ కు తరలించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి, అందరికీ కలిపి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.