: ఆటోడ్రైవర్ల దారుణానికి బలైపోయిన బాలిక!


రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేళ్ల బాలికపై నలుగురు ఆటోడ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక తండ్రితో కలిసి వికారాబాద్ నుంచి తన సొంత గ్రామం ఇజ్రాచిట్టంపల్లికి ఆటోలో వెళుతుండగా, ఆటో డ్రైవర్, నలుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, తండ్రిని కొట్టి, బాలికను ఎత్తుకు పోయారు. రహదారికి వందగజాల దూరంలోని ఓ గుంతలోకి తీసుకెళ్లి, పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలిక తలపై కొట్టి, మెడకు తాడు బిగించి హత్య చేశారు. తండ్రి ఫిర్యాదు, స్థానికుల సమాచారంతో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో డాగ్ స్క్వాడ్ తో నిందితుల గాలింపు చేపట్టారు. ఘటనా స్థలిలో దొరికిన ఆధారాలతో దోషులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అంతా ఆటోడ్రైవర్లే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News