: అమితాబ్ షూటింగ్ స్పాట్ వద్ద కాల్పులు


ముంబై ఫిలింసిటీలో కాల్పుల కలకలం రేగింది. ఓ సెక్యూరిటీ ఏజెన్సీ యజమానిపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. రాజు షిండే అనే వ్యక్తిపై బైక్ పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. పొట్టలో, భుజంపై కాల్పులు జరిపినట్టు వివరించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఫిలింసిటీలో జరిగిన కాల్పులపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఆ కాల్పుల ఘటన తమ షూటింగ్ స్పాట్ కు కేవలం 20 అడుగుల దూరంలోనే చోటుచేసుకుందని ట్విట్టర్ లో తెలిపారు. ఒకరు చనిపోయి ఉండొచ్చంటూ ట్వీట్ చేశారు. ఘటన కారణంగా ఫిలింసిటీ పోలీసుమయం అయిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News