: ఐదుగురు ఎమ్మెల్సీలు గెలిచే బలం మాకుంది: టీఆర్ఎస్


ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపిన ఐదుగురు సభ్యులు గెలిచే బలం తమకుందని టీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. టీడీపీ కంటే తమకే ఒక ఓటు ఎక్కువగా ఉందని చెబుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఓటు హక్కు వివాదం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినదేనని టీఆర్ఎస్ పేర్కొంది. అయితే ఆంగ్లో ఇండియన్ సభ్యుడికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని, ఆయన రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకూడదని ఎక్కడా లేదని టీఆర్ఎస్ వాదిస్తోంది. అనవసరంగా ఈ వివాదంలోకి అసెంబ్లీ కార్యదర్శిని లాగొద్దని సూచించింది. టీడీపీకి అనుమానాలుంటే కోర్టుకెళ్లాలి, లేదంటే ఈసీని కలవాలని హితవు పలికింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, నామినేట్ ఎమ్మెల్యే ఎల్వీ స్టీఫెన్ ఓటు హక్కును ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిగణనలోకి తీసకోవద్దని టీడీపీ ఎమ్మెల్యేలు అంతకుముందు అసెంబ్లీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పైవిధంగా స్పందించింది.

  • Loading...

More Telugu News