: ఆ విషయంలో పూరీ అయినా, ఇంకొకరైనా నాకు సంబంధం లేదు: రాంగోపాల్ వర్మ


తాను భోజన ప్రియుడ్ని కాదని రాంగోపాల్ వర్మ చెప్పాడు. 365 డేస్ ప్రమోషన్ లో వర్మ మాట్లాడుతూ, తన దగ్గరకు రెగ్యులర్ గా వచ్చే పూరీ జగన్నాథ్, ఇతర వ్యక్తులను ఎవరి భోజనం వారే తెచ్చుకోవాలని చెప్పేస్తానని అన్నాడు. తన టేబుల్ మీద భోజన పదార్థాలు, ఎంగిలి ప్లేట్లు ఉంటే తనకు నచ్చదని, అంతే కాకుండా వారు తినేసిన తరువాత ప్లేట్లు వదిలేస్తే అవన్నీ కడగడం అస్సలు ఇష్టం ఉండదని వర్మ చెప్పాడు. అందుకే ఎవరి భోజనం వారే తెచ్చుకోండని చెప్పేస్తానని, వారు కూడా దానికి అలవాటు పడిపోయారని వర్మ తెలిపాడు. ఆకలి వేసినప్పుడు తన ముందు ఏముంది? అన్నది చూడనని, ఏదున్నా తినేస్తానని వర్మ వివరించాడు. ఎప్పుడైనా రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు ఆర్డర్ ఇచ్చినది వచ్చే లోపు టైమ్ వేస్టు ఎందుకని సాస్ తినేస్తానని వర్మ చెప్పాడు. వంటగదిలోకి ఎప్పుడూ వెళ్లని తాను '365 డేస్' షూటింగ్ సందర్భంగా వంటగదిలో అడుగుపెట్టానని వర్మ తెలిపాడు.

  • Loading...

More Telugu News