: నా పెళ్లి అట్టర్ ఫ్లాప్...జీవితం ఎలా ఉంటుందో '365 డేస్'లో నిజాయతీగా చెప్పా: రాంగోపాల్ వర్మ


నిజజీవితంలో తన వైవాహిక జీవితం అట్టర్ ఫ్లాప్ అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పాడు. తన కొత్త సినిమా '365 డేస్' ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ వంటల కార్యక్రమంలో పాల్గొన్న వర్మ, తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. తన భార్యకు గజల్స్ అంటే ఇష్టమని, తనకు మెలడీస్ అంటే ఇష్టమని అన్నాడు. తమ వివాహానికి ముందు 'ఇది పెద్ద విషయం కాలేదు కానీ, పెళ్లి తరువాత ఒకే ఇంట్లో కాపురమున్నప్పుడు అది పెద్ద విషయం అయిపోయింద'ని అన్నాడు. ఇది తన జీవితంలోనే కాదని, ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుందని వర్మ వివరించాడు. అయితే ఇలాంటి కొన్ని అనుభవాల తరువాత సర్దుకుపోవడమో, లేక జీవితాన్ని అలాగే తీసుకోవడమో చేస్తుంటారని వర్మ చెప్పాడు. ప్రేమించుకునేటప్పుడు అంతా అద్భుతంగా ఉంటుందని, పెళ్లి తరువాత ఏడాదికే ఎవరు ఏంటో పూర్తిగా తెలిసిపోతుందని, అప్పటి నుంచి మనస్పర్థలు వస్తాయని వర్మ చెప్పాడు. తమ సినిమాలో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పానని వర్మ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News